Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nammithi Nayya Yesayya Nee Paadamu

నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదము

Nammithi Nayya Yesayya Nee Paadamu

Lyricist: Burrareddy
Chorus
నమ్మితి నయ్యా యేసయ్యా నీ పాదములే నమ్మితి నయ్యా యేసయ్యా
నమ్మితి నయ్య నా నెమ్మదిలో నిన్ను నిమ్ముగఁ గృప నాపైఁ గుమ్మరిం
చుము వేగ‖ నమ్మితి ‖
Verse
పాప భార మనెడు మోపు మోయఁగ లేక కాపు నీవె యని నీ దాపు
జేరిన నేను‖ నమ్మితి ‖
Verse
ఆపత్కాలమునందుఁ బ్రాపు నీవని వేఁడఁ గాపాడి రక్షించు
కరుణాసముద్రుఁడ‖ నమ్మితి ‖
Verse
ఎన్ని తప్పులు నాలో నున్న నీ దయ చేత మన్నించి రక్షించు మహిత
దేవ కుమార‖ నమ్మితి ‖
Verse
దాసుని మొఱ నీవు వేసారక విని వాసిగా రక్షించు పరమ జనక
నన్ను‖ నమ్మితి ‖

Related Tags

FaithPrayerSurrender