Verse
నన్నాకర్షించిన నీ స్నేహ బంధం
ఆత్మీయ అనుబంధం‖ 2x ‖
ఆరాధన నీకే యేసయ్యా‖ 2x ‖
నా చేయిపట్టి నన్ను నడిపి
చేరదీసిన దేవా‖ 2x నన్నాకర్షించిన ‖
Verse
మహా ఎండకు కాలిన అరణ్యములో
స్నేహించిన దేవుడవు నీవు‖ 2x ‖
సహాయకర్తగ తోడు నిలచి
తృప్తి పరచిన దేవా
సేదదీర్చిన ప్రభువా‖ 2x నన్నాకర్షించిన ‖
Verse
చెడిన స్థితిలో లోకంలో పడియుండగా
ప్రేమించిన నాథుడవు నీవు‖ 2x ‖
సదాకాలము రక్షణ నిచ్చి
శక్తినిచ్చిన దేవా
జీవమిచ్చిన ప్రభువా‖ 2x నన్నాకర్షించిన ‖