Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannedhiyu Kadhapaledhayya

నన్నేదియు కదపలేదయ్యా

Nannedhiyu Kadhapaledhayya

Lyricist: K Y Ratnam
Verse
నన్నేదియు కదపలేదయ్యా
నీ తోడు వుంటె నాకు చాలయ్యా
యేసూ… ఊ…. ఊ… ఉ
నీ తోడు వుంటె నాకు చాలయ్యా
నన్నేదియు కదపలేదయ్యా
నీ అభయముంటె నాకు చాలయ్యా
నన్నేదియు తాకలేదయ్యా
ఎన్ని శోధనలు నన్ను చుట్టినా
నేనేన్నడు ఓడిపోనయ్యా
మోయలేని భారము మోయుచుండగా
నా సహాయమై నీవు నిలిచినావయ్యా
నడువలేక నా అడుగులు సన్నగిల్లగా
నా చేయి పట్టి నన్ను నడిపినావయ్యా
ఆత్మీయులే ఆవిరైనా – కనికరమే కరిగిపోయినా
నీ తోడు నీ నీడ నను వీడలేదయ్యా
గుండెనిండ బాధలు నిండియుండగా
అంతరంగమును చూచి ఆదరించావు
కళ్ళనిండ కన్నీళ్లే పొర్లుచుండగా –
శాశ్వతమైనా కృపతో ఓదార్చావు
ఆప్యాయతె అంతరించగా – పలకరింపె దూరమవ్వగా
నీ తోడు నీ నీడ నను వీడలేదయ్యా

Related Tags

FaithComfortProtection