Verse
నన్నెంతగా ప్రేమించితివో...
నిన్నంతగా దూషించితినో...
Verse
నన్నెంతగా నీవెరిగితివో...
నిన్నంతగా నే మరచితినో...
Chorus
గలనా... నే చెప్పగలనా...
దాయనా ... నే దాయగలనా...‖ 2x ‖
అయ్యా... నా యేసయ్యా...
Verse
నాదం... తాళం... రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము...‖ 2x ‖
Verse
ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...
ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ...‖ 2x ‖
ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...
ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ...‖ 2x గలనా ‖
Verse
ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...
ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో...‖ 2x ‖
ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...
ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో...‖ 2x గలనా ‖