Verse
నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా‖ 2x ‖
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము‖ 2x ‖
Verse
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో‖ 2x ‖
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో‖ 2x గలనా ‖
Verse
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో‖ 2x ‖
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో‖ 2x గలనా ‖