Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannenthagaano Preminchenu

నన్నెంతగానో ప్రేమించెను

Nannenthagaano Preminchenu

Lyricist: Diyya Prasada Rao
Verse
నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము – నా శాపము
తొలగించెను నను కరుణించెను‖ 2x నన్నెంత ‖
Verse
సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో‖ 2x ‖
పడనీయక దరి చేరనీయక‖ 2x ‖
తన కృపలో నిరతంబు నను నిల్పెను‖ 2x నన్నెంత ‖
Verse
సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము‖ 2x ‖
నేర్పించెను నాకు చూపించెను‖ 2x ‖
వర్ణింపగా లేను ఆ ప్రభువును‖ 2x నన్నెంత ‖
Verse
కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును‖ 2x ‖
నా కోసమే యేసు శ్రమ పొందెను‖ 2x ‖
నా పాపమంతటిని క్షమియించెను‖ 2x నన్నెంత ‖
Verse
ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు‖ 2x ‖
ఏమిత్తును నేనేమిత్తును‖ 2x ‖
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును‖ 2x నన్నెంత ‖

Related Tags

PraiseGraceSalvation