Verse
నన్నెంతగానో ప్రేమించిన ప్రభువా
నా దీన బ్రతుకునే దీవించిన దేవా‖ 2x ‖
నిన్నే ఆరాధింతును – నీలో ఆనందింతును‖ 2x ‖
నా యవ్వనమంతా… నా జీవితమంతా‖ 2x Nannenthagaano ‖
Verse
ధరలోని మన్నుతో సమమైన నన్ను
ఎన్నుకొని ఉన్నత స్థితికి చేర్చినావు‖ 2x ‖
అన్నీ నీవే నాకై సమకూర్చినావు
ఉన్నాను నీ తోడు భయపడకన్నావు‖ 2x ‖
వాక్యపు మన్నాతో పోషించిన నన్నే
ఎన్నడూ విడువని ఎడబాయని నిన్నే‖ నిన్నే ‖
Verse
దినమెల్ల నా కొరకే కనిపెట్టినావు
ఎల్లవేళలా నా తోడుగ నిలిచావు‖ 2x ‖
మెల్లని నీ స్వరముతో మాట్లాడినావు
చల్లని కరములతో నా కన్నీరు తుడిచావు‖ 2x ‖
పాపపు ముళ్ళును తొలగించుటకై నాలో
మరణపు విల్లును విరచిన దేవా నీలో‖ నీలో ‖