Chorus
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న
తండ్రి వనుచు నేను నిన్ను ఁ జేరితి నాయనా‖ నన్ను ‖
Verse
దూరమునకుఁ బోయి నీ దరిఁ జేర నైతిని నాయనా నేను కారు
మూర్ఖపు పిల్లనై కా రడవిఁ దిరిగితి నాయనా‖ నన్ను ‖
Verse
మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ
నైతిని ప్ర పంచమందున నాయనా‖ నన్ను ‖
Verse
చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా నా చాల మొఱల
నాలకించుము జాలిగల నా నాయనా‖ నన్ను ‖
Verse
జ్ఞాన మంతయుఁ బాడుచేసి కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల
తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా‖ నన్ను ‖
Verse
కొద్ది నరుఁడను దిద్ది నను నీ యొద్దఁ జేర్చుము నాయనా నీ యొద్దఁ
జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైతిని నాయనా‖ నన్ను ‖
Verse
ఎక్కడను నీవంటి మార్గము నెఱుఁగ నైతిని నాయనా నీ ఱెక్క
చాటున నన్ను ఁ జేర్చి చక్కపరచుము నాయనా‖ నన్ను ‖
Verse
శత్రువగు సాతాను నన్ను మిత్రు ఁ జేయను నాయనా యెన్నో సూత్రములు
గల్పించెను నా నేత్రముల కో నాయనా‖ నన్ను ‖
Verse
వాసిగా నేఁ బాపలోకపు వాసుఁడ నో నాయనా నీ దాసులలో
నొకనిగా ననుఁ జేసి కావుము నాయనా‖ నన్ను ‖