Verse
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా
కన్న తండ్రి వనుచు నేను నిన్నుజేరితి నాయనా
Verse
దూరమునకుబోయి నీ దరి జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా రడవిదిరిగితి నాయనా
Verse
మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా
నేను వంచితుండ నైతిని ప్రపంచమందున నాయనా
Verse
చాల మారులు తప్పిపోతిని మేలు గానకనాయనా
నా చాలమొరల నాలకించుము జాలిగల నా నాయనా
Verse
కొద్ది నరుడను దిద్ది నన్ను నీ యెద్ద జేర్చుము నాయనా
యెద్దజేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయనా
Verse
ఎక్కడను నీ వంటి మార్గము నెరుగ నైతిని నాయనా
నీ రెక్కచాటున నన్ను జేర్చి చక్కపరచుము నాయనా