Chorus
నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా‖ నన్ను ‖
Verse
ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను‖ 2x ‖
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ‖ నన్ను ‖
Verse
హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి‖ 2x ‖
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి‖ నన్ను ‖
Verse
కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను‖ 2x ‖
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి‖ నన్ను ‖
Verse
దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను‖ 2x ‖
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి‖ నన్ను ‖
Verse
నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని‖ 2x ‖
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి‖ నన్ను ‖