Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Gannayya Raave Naa Yesu Na

నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు న

Nannu Gannayya Raave Naa Yesu Na

Lyricist: Purushothamu Choudari
Chorus
నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా
Verse
ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ
జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ‖ నన్ను ‖
Verse
హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ
కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి‖ నన్ను ‖
Verse
కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ
సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి‖ నన్ను ‖
Verse
దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు
లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి‖ నన్ను ‖
Verse
నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప
నిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి‖ నన్ను ‖

Related Tags

DevotionalPrayerSurrender