Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Inthagaa Preminchina Naa Yesu Raajaa

నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా

Nannu Inthagaa Preminchina Naa Yesu Raajaa

Lyricist: Krupa Jeba
Chorus
నన్ను ఇంతగా ప్రేమించిన నా యేసు రాజా
అన్ని వేళల తోడుండిన నా ప్రాణ నాథా
ప్రతీ రేయి ప్రతీ పగలు ఆరాధన నీకేనయ్య స్తుతి యాగము నే చేసెదా
ఆరాధనా........ఆరాధనా .ఆరాధనా యేసయ్యా
Verse
వట్టి పాత్రగానే నేను నీ సన్నిధికి చేరితి
ఎన్నతగని వాడను నేనని నీ యెదుటే విలపించితిని
అనాధగా నన్ను విడువక నా దరి చేరితివి
అనాధగా నన్ను విడువక నీ కౌగిలిలో చేర్చుకొంటివి
ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా‖ 2x ‖
Verse
నిన్ను విడిచిన సమయంలో అపజయాలే కలిగెనుగా
నాకు కలిగిన నిందలలో కృంగినేను కృశించగా
ఒంటరిగా నన్ను విడువక నా పక్షమై నిలిచితివి
ఒంటరిగా నన్ను విడువక జయధ్వనులతో నడిపితివి
ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా‖ 2x ‖
Verse
నాదు విశ్వాస పోరాటములో నీవాక్కుకై పరుగెత్తితిని
ఆపదలెన్నో నన్ను చుట్టుకొనగా నీవైపేనే చూచితిని
ఏకాకినై నేనుండగా నీ కృపను చూపితివి
ఏకాకినై నేనుండగా నీ ప్రేమతో ఆదుకొంటివి
ఆరాధనా... ఆరాధనా..... అరాధనా యేసయ్యా

Related Tags

WorshipDevotionalJesus