Verse
నన్ను కాదనవని – నను కాదనలేవని
నీ చెంతకు నే చేరినా‖ 2x ‖
నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని
నీ మనసే నే కోరినా‖ 2x నన్ను ‖
Verse
లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే
అలసి నీ చెంత చేరినా‖ 2x ‖
సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన
నీవే నా దిక్కని ఎంచినా –‖ 2x నన్ను ‖
Verse
లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే
సొలసి నీ శరణు కోరినా‖ 2x ‖
శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన
నీవే ఆధారమని యెంచినా –‖ 2x నన్ను ‖