Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Kaavaga Vachchina

నన్ను కావగ వచ్చిన

Nannu Kaavaga Vachchina

Verse
నన్ను కావగ వచ్చిన నజరేయా యేసయ్యా
నేను పాపము చేసినా చూపావు నీ దయా
నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా
సిలువ నీడలో నన్ను దాచుమయ్యా
లోకమంతా నన్ను దోషిగ చూసినా
ప్రేమతోనే నన్ను చేరదీసిన‖ నన్ను ‖
Verse
నిన్ను విడచి దూరమైనా ధూళి నేనే యేసయ్యా
లోకాశలకు లోబడిన లోభిని నేనేనయ్యా
అందరు నన్ను అనాథ చేసి పోయినా
అంధకారమే నాకు బంధువై మిగిలినా
నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా‖ నన్ను ‖
Verse
నీ చరణములు చేరగానే నా గతి మారేనయ్యా
నీ శరణము వేడగానే నీది నాదిగా మారెనే
ఏ యోగ్యత నాకు లేకపోయినా
నీ వారసునిగా నన్ను ఎంచిన
ఇది ఊహకందని చిత్రమైన ప్రేమ నీదయ్యా‖ నన్ను ‖

Related Tags

GraceRepentanceSalvation