Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nannu Neevale Nirminchinanu

నన్ను నీవలె నిర్మించినను

Nannu Neevale Nirminchinanu

Verse
నన్ను నీవలె నిర్మించినను
కోల్పోతి దేవా నీ రూపమును
హేయ క్రియలతో సిలువేసినను
నాపై నీ కృపను తొలగించవెందుకు
నిను బాధించినా భరియించితివా
నా పాపం జ్ఞాపకమే రాలేదా‖ 2x నన్ను నీవలె ‖
Verse
ఎరిగి ఎరిగి చెడిపోతిని
తెలిసి తెలివిగా తప్పిపోతిని‖ 2x ‖
బ్రతికున్న శవమునై నేనుంటిని
అహము ముదిరి పది లేవలేకపోతిని‖ 2x నన్ను నీవలె ‖
Verse
భయభక్తులు లేని వెర్రివాడనై
కుంపటి ఒడిలో పెట్టుకుంటిని‖ 2x ‖
ఒక పూటకూటికై ఆశపడితిని
వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని‖ 2x నన్ను నీవలె ‖
Verse
సిల్వలో నీ శ్రమ చూడకుంటిని
కల్వరి ప్రేమను కానకుంటిని‖ 2x ‖
నిన్ను సిలువ వేయమని కేకలేసితి
అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా‖ 2x నన్ను నీవలె ‖

Related Tags

RepentanceGods LoveConfession