Verse
నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా‖ 2x ‖
నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప మాత్రమే‖ 2x ‖
నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా‖ 2x యేసయ్యా … ‖
Verse
ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు
తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు‖ 2x ‖
బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప‖ 2x ‖
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను‖ నీ కృపయే ‖
Verse
నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు‖ 2x ‖
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప‖ 2x ‖
నీ కృప లేకుంటేనే నేను లేను
నీ కృప లేకుంటేనే నేనేమి లేను‖ నీ కృపయే ‖