Verse
నన్ను సృజియించిన ఆదేవుడు
ఎక్కడఉన్నాడో
అని ఊరూ వాడా చెట్టూపుట్టా అన్నీ
వెదికాను‖ 2x Nanu ‖
సృష్టినే దేవుడని నేను పూజించాను
సృష్టికర్తను మరచీ నేనెంతో వగచాను
Verse
వెదకిన దేవుడు దొరకగపోగా
నేనే దేవుడని సరిపెట్టుకున్నాను‖ 2x ‖
రక్తము కార్చిన వాడె దేవుడని‖ 2x ‖
తెలిసిన క్షణమున సిలువను చేరితిని‖ 2x Nanu ‖
Verse
మత ఛట్రములో దేవుని బంధించి
విదేశీయతను క్రీస్తుకు ఆపాదించి‖ 2x ‖
నిజరక్షకునీ అంగీకరించక‖ 2x ‖
నిష్ఠగ నరకాన చేరుట న్యాయమా‖ 2x ‖
నను సృజియించిన ఆదేవుడు
యేసులో ఉన్నాడు
అని ఊరు వాడ పల్లే వెళ్ళీ‖ 2x తిరిగీ చెబుతాను ‖