Verse
నను కలుగ జేసిన – విధము తలపోసిన
భయము ఆశ్చర్యము పుట్టును హృదయమందున
Pre-Chorus
స్తుతులు చెల్లించుచున్నా అందువలన
తన స్వరూపమున నరుని నిర్మించిన
అందమైన సృష్టిపైన అధికారమిచ్చిన
దేవుడు తనకంటే కొంతే నను తక్కువగాను చేసెను
ఇంత కృప పొందే యోగ్యం ఏముంది నాలోన
మంటిదేహమున మహిమను నింపిన
శ్రేష్టమైన వైభవమును ధరియింపజేసిన
దేవుడు తన గ్రంధమునందు నా దినములు రాసియుంచెను
ఇంత ప్రేమానురాగం ఏలనో నాపైన
ఘనపరచదగిన మన ప్రభువు చేసిన
దివ్యమైన ఆకసమును తారలను చూచిన
దేవుడు నను దర్శించుటకు నరుడను ఏపాటివాడను
ఇంత ఆత్మీయ బంధం ఎందుకో నాతోన