Verse
నను ప్రేమించిన యేసయ్యా నిన్ను నేను స్తుతింతునయ్యా
నాకాదరణానందము నీవే నను రక్షించిన ఓ రక్షకుడా
Verse
బలహీనుడను బహు పాపిని ధనహీనుడను దరిద్రుడను
ఏమి చూచి నన్ను వెదకి రక్షించినావు
ఎంత ప్రేమ నీది లోకానికి ఒక వింతైనది
Verse
వీధులలో పడి మోసావు భారమైన సిలువ నీవు
నాదు పాపపు మోపంతా నీ వీపుపై మోసావు
దాపు జేరిన నన్ను దయతో మన్నిచినావా
Verse
మరణమును జయించినావు మృత్యువును ఓడించినావు
మరణ ఛాయలోనున్న నాకు జీవిమిచ్చినావు
ఏమి నీకు అర్పింతునయ్యా నా వందనం అందుకోవయా