Chorus
నను సృజియించిన నా తండ్రికే ఆరాధన
నను రక్షించిన యేసయ్యకే ఆరాధన
నను నడిపించే పరిశుద్దాత్మునికే ఆరాధన
నను పాలించే త్రియేక దేవునికే ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
Verse
మట్టిని తీసాడు తన రూపును చేశాడు
ప్రాణం పోసాడు జీవించమన్నాడు ఆతండ్రికే ఆరాధన
Verse
మహిమను విడిచాడు మంటి దేహము దాల్చాడు
ప్రాణం పెట్టాడు నిత్య జీవము నిచ్చాడు యేసయ్యకే ఆరాధన
Verse
పరిపూర్ణుని చేయుటకై పరిశుద్దాత్ముడు వచ్చాడు
అభిషేకించాడు నను నడిపించుచున్నాడు ఆత్మ దేవునికే ఆరాధన