Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nanu Yedabayaka Padiponeeyaka Podiginchithivi Naa Jeevamu

నను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము

Nanu Yedabayaka Padiponeeyaka Podiginchithivi Naa Jeevamu

Lyricist: A R Stevenson
Chorus
నను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము
బ్రతికించే కదా నీ వాత్సల్యము
నీకే కృతజ్ఞత స్తోత్రము
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక
Verse
నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము
నిలబెట్టగోరి శేషంగా నను
రక్షించితివి ఆశ్చర్యముగను
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక
Verse
ఆటంకములను దాటించుచు
చేసితివి అనుకూలము
సమకూర్చి అన్ని క్షేమం కొరకును
హెచ్చించితివి అనూహ్యముగను
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక
Verse
నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము
నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను
దర్శించితివి ఆప్యాయముగను
దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును
నను ఎడబాయక

Related Tags

PraiseWorshipThanksgiving