Verse
నరకమనునది నిరంతముండునయో
ఆ ఘోరనరకము నందు పాపులు బాథపడుదురయో
మరియు నగ్ని పురుగులందున కొరుకు చుండును తరుగులేకను
ధరణికాదిది దరియుకాదు మరణమెదకిన దొరకదందున‖ నరకము ‖
Verse
గప్పు గప్పున రగులుచుండునయ్యో ఆ ఘోరనరకము
నిప్పులెగయుచు పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ
పైకిలేచును అబ్బా! అబ్బాని యేడ్చుచుందురు బొబ్బలిడు
దురు అడ్డమొచ్చెడి అబ్బలెవరు కానరందున‖ నరకము ‖
Verse
నోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు యేసు క్రీస్తును
నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో పురుగు చావదు
అగ్ని ఆరదు కొరుకుచుందురు పండ్లు పట పట తిరిగితిరిగి
చూచుచుందురు పరుగులెత్తక యేడ్చు చుందురు‖ నరకము ‖