Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nashiyinchedi Lokamlo Vasiyinchavu

నశియించెడి లోకంలో వసియించవు

Nashiyinchedi Lokamlo Vasiyinchavu

Verse
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం‖ 2x ‖
అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా‖ నశియించెడి ‖
కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా‖ 2x ‖
క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి‖ 2x ‖
వసియించు కలకాలం – సత్యమైన లోకంలో‖ నశియించెడి ‖
నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో‖ 2x ‖
ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని‖ 2x ‖
యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని‖ నశియించెడి ‖

Related Tags

SalvationEternityTransience