Verse
నశియించు ఆత్మలెన్నియో – చేజారి పోవుచుండగా
పరితాప మొందెనేసు – ప్రియమార నిన్ను పిలువ
పరికించుమయ్యా సోదరా ఓ.. ఓ.. ఓ..
Verse
నీ పాప భారమంతా – ప్రభు యేసు మోసెగా
నీ పాప గాయములను – ఆ యేసు మాన్పెగా
అసమానమైన ప్రేమ ఘనుమా ఈ సువార్తను‖ 2x ‖
లోకాన చాటగా‖ 4x నశియించు ‖
Verse
ఈ లోక భోగము – నీకేల సోదరా
నీ పరుగు పందెమందు – గురి యేసుడే కదా
ప్రభు యేసునందే శక్తినొంది సాగుటే కదా‖ 2x ‖
ప్రియ యేసు కోరెను‖ 4x నశియించు ‖