Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ne Beedha Chinna Pillanu Naa Buddha

నే బీద చిన్న పిల్లను నా బుద్ధ

Ne Beedha Chinna Pillanu Naa Buddha

Lyricist: Cecil Frances Alexander
Verse
నే బీద చిన్న పిల్లను
నా బుద్ధి స్వల్ప మయినది
నా దివ్య యేసు కొఱకు
నే నేమి చేయగలను?
Verse
నిత్యంబుఁ చిన్న పనులు
నే చాలఁ జేయవచ్చును
నా చిన్న తప్పు లన్నియు
నే చక్క పెట్టవచ్చును.
Verse
మనస్సునందు కోపము
వేమాఱు పుట్టునప్పుడు
నా కన్ను లెఱ్ఱఁ జేయక
నే నోర్చు కొనవచ్చును.
Verse
నే తిన్నగాను నడ్చుచు
ఇల్లంత వెలిఁగించుచు
నా యేసుకై యుల్లాసముఁ
బుట్టింపవచ్చు నెప్పుడు
Verse
నే నెంత చిన్న పిల్లను
నా కుండు చిన్న బాధకు
నే తాలి ప్రేమ స్తోత్రము
లర్పించుచుండఁగలను.

Related Tags

ObedienceHumilityChildren