Verse
నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభు
నన్ వెద్కినట్లు నేనును - నశించువారిన్ వెద్కెదను
Verse
ఆత్మీయ భోజనంబుతో - పోషించునట్లు నన్నును
మూర్ఛిల్లువారికిన్నదే - నేనియ్యగాను నడ్పుమా
Verse
కష్టంబులొందు వారిని రక్షింప గల్గునట్లుగా
నాకిమ్ము నీదు శక్తిని - నన్ ధైర్య పర్చుమో ప్రభూ
Verse
నే నేర్పునట్లు నాకును - నీ దివ్య వాక్యం నేర్పుము
ఆలించునట్లనేకులు - నా బోధను దీవింపుమా
Verse
ప్రయాసమొందు వారికి - విశ్రాంతి కల్గునట్లుగా
ఓదార్చు శక్తి మెండుగా - నీ యాత్మచే నాకిమ్మయా
Verse
నీ దివ్యమోము జూచుచున్ నీ హాయి సంతోషంబులు
నే నొందుదాక నన్నిలన్ - నీ చిత్తమార నడ్పుమా