Verse
నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప
ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప‖ 2x ‖
నీ ప్రేమ బలమైనది
నీ మాట విలువైనది‖ 2x నే బ్రతికి ‖
Verse
లోకములో నేనుండగా
నీ కరములు చాపి పిలిచావయ్యా
దుఃఖములో నేనుండగా
నన్ను ఓదార్చినావు నా యేసయ్యా‖ 2x ‖
నా ఆధారము నీవే
నా ఆశ్రయము నీవే‖ 2x నే బ్రతికి ‖
Verse
నా వారలే నన్ను నిందించినా
నా బంధువులే నన్ను వెలివేసినా‖ 4x ‖
ఎవరున్నా లేకున్ననూ
నీ తోడు చాలునయ్యా
ఏమున్నా లేకున్ననూ
నీ కృపయే చాలునయ్యా‖ నే బ్రతికి ‖
Verse
నా స్థితి నీవు చూసావయ్యా
నా గతినే నీవు మార్చావయ్యా‖ 2x ‖
నా ఆధారము నీవే
నా ఆశ్రయము నీవే‖ 2x నే బ్రతికి ‖