Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ne Nammudu Ne Nammudu Yesu Naakai Maraninchenani

నే నమ్ముదు నే నమ్ముదు యేసు నాకై మరణించెనని

Ne Nammudu Ne Nammudu Yesu Naakai Maraninchenani

Verse 1
Reference: ఈ నామముననే రక్షణ పొందవలెను అపొస్తలుల కార్యములు Acts 4:12
Verse
ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు
మనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు
Chorus
నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెనని
పాపంబు పోవ సిలువలో రక్తము చిందెను
Verse
రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే
వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు
Verse
ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే
నరకదండన యంతయు తొలగించు నామము
Verse
పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు
సాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్
Verse
పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్
బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు

Related Tags

GospelSalvationConfession