Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ne Neevaadanai Yundagan Koredan Yesa

నే నీవాఁడనై యుండఁ గోరెదన్ యేస

Ne Neevaadanai Yundagan Koredan Yesa

Lyricist: Frances Janevan Alsteen
Verse
నే నీవాఁడనై యుండఁ గోరెదన్
యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్
నన్నుఁ జేర్చు నీదరిన్
నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు
రక్షకా
నీవు పడ్డ సిల్వకున్
నన్నుఁ జేర్చు చేర్చు చేర్చు
రక్షకా
గాయపడ్డ ప్రక్కకున్
Verse
నన్నుఁ బ్రతిష్ఠపర్చుమీ నాధా
నీదు కృపవల్లనే
నాదు నాత్మ నిన్ను నిరీక్షించు
నీ చిత్తంబు నాదగున్
Verse
నీదు సన్నిధిలో నిఁక నుండ
నెంత తుష్టి నాకగున్
స్నేహితుని మాటలాడెదన్
సర్వశక్త ప్రభుతో
Verse
నీదు దివ్య ప్రేమాతిశయము
ఇహ బుద్ధి కందదు
పరమందున దాని శ్రేష్ఠత
నే ననుభవించెదన్

Related Tags

WorshipDevotionalSurrender