Verse
నే నీవాడనై యుండగోరెదన్ - యేసు ప్రియ రక్షకా
నీవు చూపు ప్రేమను గాంచితిన్ - నన్ను జేర్చు నీదరిన్
Chorus
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - నీవు పడ్డ సిల్వకున్
నన్ను జేర్చు చేర్చు చేర్చు రక్షకా - గాయ పడ్డ ప్రక్కకున్
Verse
నన్ను బ్రతిష్ఠబర్చుమీ నాథా - నీదు కృపవల్లనే
నాదు ఆత్మ నిన్ను నిరీక్షించున్ - నీదు చిత్తంబు నాకగున్
Verse
నీదు సన్నిధిలో నికనుండ - నెంత తుష్ఠి నాకగున్
స్నేహితునిగ మాటలాడుదున్ - సర్వ శక్త ప్రభుతో
Verse
నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహబుద్ధికందదు
పరమందున దాని శ్రేష్ఠత - నే ననుభవించెదన్