Chorus
నే పాడెద నిత్యము పాడెద - ప్రభువా నీకు స్తుతి పాడెదన్
Verse
మంచి కాపరి నీవైతివి గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి
పాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నా కొసగితివి
హర్షించి ప్రభు పాడెదను
Verse
గొప్ప కాపరివి తోడై యున్నావు ప్రతి అవసరతల్ తీర్చుచున్నావు
నా ప్రాణమునకు సేదనుదీర్చి మరణలోయలలో తోడై యుందువు
యాత్రలో పాడుచు వెళ్ళెదను
Verse
ఆత్మల కాపరి సత్యవంతుడవు గొర్రెలన్నిటికి కాపరి నీవై
ద్వేషించెదవు దొంగకాపరులన్ నీగొర్రెలు నీస్వరమును వినును
హృదయపూర్తిగ పాడెదను
Verse
ప్రధానకాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు
మహిమకిరీటము నాకొసగెదవు పరమనగరమందు నన్నుంచెదవు
ఎలుగెత్తి ప్రభు పాడెదను