Verse
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా
నే పాపినో ప్రభువా - నను కావుమా దేవా‖ 2x ‖
Verse
కరుణాలవాలా - నీ మ్రోల నేలా - తల వాల్చి నిలిచేనులే‖ 2x ‖
దయ చూడు చాలా - దురితాల ద్రోలా - నీ సాటి దైవంబు లేరవ్వరు
లేరవ్వరు‖ నే పాపినో ‖
Verse
వుదయించినావు - సదయుండ నీవు - ముదమార మా కొరకై‖ 2x ‖
మోసీవు సిలువ - నీ ప్రేమ విలువ నా తరమా చెల్లించ - నా యేసువా
నా యేసువా‖ నే పాపినో ‖