Verse
నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా‖ 2x ‖
Verse
యేసుతో గడిపెద యేసుతో నడిచెద‖ 2x ‖
పరమును చేరగ నే వెళ్లెద‖ 2x ‖
హనోకు వలె సాగెదా‖ నే సాగెద ‖
Verse
వెనుక శత్రువులు వెంటాడిననూ‖ 2x ‖
ముందు సముద్రము ఎదురొచ్చినా‖ 2x ‖
మోషె వలె సాగెదా‖ నే సాగెద ‖
Verse
లోకపు శ్రమలు నన్నెదిరించినా‖ 2x ‖
కఠినులు రాళ్ళతో హింసించినా‖ 2x ‖
స్తెఫను వలె సాగెదా‖ నే సాగెద ‖
Verse
బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే‖ 2x ‖
క్రీస్తుకై హత సాక్షిగా మారిన‖ 2x ‖
పౌలు వలె సాగెదా‖ నే సాగెద ‖
Verse
తల్లి మరచిన తండ్రి విడచిన‖ 2x ‖
బంధువులే నన్ను వెలివేసినా‖ 2x ‖
బలవంతుని వలె సాగెదా‖ నే సాగెద ‖