Verse
నే స్తుతించెదను యేసు నామమును
భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని
నిత్యం నిత్యం నే స్తుతించెదను‖ నే స్తుతించెదను ‖
Verse
ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్
వర్ణింప నెవ్వరికి తరమౌనా?‖ 2x ‖
పాపిని నన్ను రక్షించుటకై
చూపెను ప్రేమనపారముగా‖ 2x నే స్తుతించెదను ‖
Verse
పాపములన్నియు బాపుటకై
శాపములన్నియు మాపుటకై‖ 2x ‖
ఏ పాపమెరుగని ఆ పావనుడు
శాపగ్రాహియై చావొందెను‖ 2x నే స్తుతించెదను ‖
Verse
శోధన కాలముల యందున
వేదన కాలముల యందున‖ 2x ‖
నాధుడు యేసు మనతోడనుండ
అంతమేగా మన చింతలకు‖ 2x నే స్తుతించెదను ‖
Verse
ఎనలేని ప్రేమతో కౌగిలించెను
ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను‖ 2x ‖
మహామహుండు మహిమ ప్రధానుడు
మహిమతో వచ్చును మేఘముపై‖ 2x నే స్తుతించెదను ‖
Verse
రాజాధిరాజు ప్రభు యేసే
దేవాదిదేవుడు మన యేసే‖ 2x ‖
పరమందు దూతలు యిహమందు నరులు
పాడుడి ప్రభునకు హల్లెలూయా‖ 2x నే స్తుతించెదను ‖