Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ne Sthutinchedanu Yesu Naamamunu Bhajinchedanu Kreesthu Naamamunu

నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును

Ne Sthutinchedanu Yesu Naamamunu Bhajinchedanu Kreesthu Naamamunu

Chorus
నే స్తుతించెదను యేసు నామమును - భజించెదను క్రీస్తు నామమును
స్తుతికి యేసే యోగ్యుడని - నిత్యం నిత్యం నే స్తుతించెదను
Verse
ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ - వర్ణింప నెవ్వరికి తరమౌనా?
పాపిని నన్ను రక్షించుటకై - చూపేను ప్రేమన పారముగా
Verse
పాపములన్నియు బాపుటకై - శాపములన్నియు మాపుటకై
ఏ పాపమెరుగని ఆ పావనుడు - శాపగ్రాహియై చావొందెను
Verse
శోధన కాలముల యందున - వేదన కాలముల యందున
నాధుడు యేసు మనతోడనుండ - అంతమేగా మన చింతలకు
Verse
ఎనలేని ప్రేమతో కౌగిలించెను - ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
మహామహుండు మహిమ ప్రధానుడు - మహిమతో వచ్చును మేఘముపై
Verse
రాజాధిరాజు ప్రభు యేసే - దేవాదిదేవుడు మన యేసే
పరమందు దూతలు యిహమందు నరులు - పాడుడి ప్రభునకు హల్లెలూయా

Related Tags

PraiseWorshipJesus