Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ne Yesuni Velugulo

నే యేసుని వెలుగులో

Ne Yesuni Velugulo

Lyricist: Songs Of Zion
Verse
నే యేసుని వెలుగులో నడిచెదను
రాత్రింబగలాయనతో నడిచెదను
వెల్గున్ నడిచెదను – వెంబడిచెదను
యేసుడే నా రక్షకుడు
Chorus
నడిచెద నే ప్రభు యేసునితో
నడిచెద నే ప్రభు హస్తముతో
కాంతిలో నుండగ జయగాంతును
యేసునే నే వెంబడింతును
Verse
నే యేసుని వెలుగులో నడిచెదను
గాడంబగు చీకటిలో భయపడను
ఆత్మతో పాడుచు సాగిపోవుదును
యేసుడే నా ప్రియుండు‖ నడిచెద ‖
Verse
నే యేసుని వెలుగులో నడిచెదను
వెల్గులో ప్రభు స్వరము నే వినుచుందును
సర్వమిచ్చెదను చెంతనుండెదను
యేసుడే ప్రేమామయుడు‖ నడిచెద ‖
Verse
నే యేసుని వెలుగులో నడిచెదను
దిన సహాయము నే పొందెదను
సుఖ దుఃఖమైన మరణంబైన
యేసుడే నా యండనుండును‖ నడిచెద ‖
Verse
నే యేసుని వెలుగులో నడిచెదను
నా దృష్టిని ప్రభుపై నుంచెదను
సిల్వ ధ్వజమునే బట్టి వెళ్లెదను
యేసుడే నా చెంత నుండును‖ నడిచెద ‖

Related Tags

PraiseWorshipJesus