Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nedaina Nijamaina Rakshakuni Cherumaa

నేడైనా నిజమైన రక్షకుని చేరుమా

Nedaina Nijamaina Rakshakuni Cherumaa

Lyricist: A R Stevenson
Verse
నేడైనా నిజమైన రక్షకుని చేరుమా
పాడైన నీ స్థితిలో స్వస్థతను కోరుమా
నా దేశమా – నా భారతదేశమా
నువ్వొస్తే మనసిస్తే మార్చబడతావు
నా క్రీస్తే సెలవిస్తే బాగుపడతావు
నా దేశమా – నా భారతదేశమా
Verse
సృష్టికర్తను ఎరుగక
పాపిగ జీవించినా
దృష్టి తండ్రిపై నిలుపక
భ్రష్టతలో ఉండినా
జాలి కలిగి తన ఉగ్రతనింకా
పంపుటలేదు సుమా
సత్యవాక్యము నమ్మక
దేవుని దూషించినా
నిత్యజీవము పొందక
చీకటిలో ఉండినా
ప్రేమకలిగి నిను ఆహ్వానించుట
మానుట లేదు సుమా

Related Tags

InvitationRepentanceSalvation