Verse
నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును‖ నేడో రేపో ‖
Verse
చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు‖ 2x ‖
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును‖ 2x నేడో రేపో ‖
Verse
కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా‖ 2x ‖
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద‖ 2x నేడో రేపో ‖
Verse
నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు‖ 2x ‖
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే‖ 2x నేడో రేపో ‖