Verse
నేడో రేపో నా ప్రియుడేసు - మేఘాల మీద ఏతెంచును‖ 2x ‖
మహిమాన్వితుడై ప్రభు యేసు - మహి స్థలమునకు ఏతెంచును‖ 2x ‖
Verse
చీకటి కమ్మును సూర్యుని - చంద్రుడు తన కాంతి నీయడు‖ 2x ‖
నక్షత్రములు రాలిపోవును - ఆకాశ శక్తులు కదలిపోవును‖ 2x ‖
Verse
కడబూర స్వరము ధ్వనియించగా - ప్రియుని స్వరము వినిపించగా‖ 2x ‖
వడివడిగ ప్రభు చెంతకు చేరెద - ప్రియమార ప్రభుయేసును గాంచెద‖ 2x ‖
Verse
నా ప్రియుడేసుని సన్నిధిలో - వేదన రోధనలుండవు‖ 2x ‖
హల్లెలూయ స్తుతి గీతాలతో - నిత్యము ఆనంద మానందమే‖ 2x ‖