Verse
నేడు ఇక్కడ రేపు ఎక్కడో
తెలియని పయనం ఓ మానవా‖ 2x ‖
ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు
ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు‖ 2x నేడు ‖
నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే
నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే‖ 2x ‖
నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో‖ 2x ‖
నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు‖ నేడు ‖
అది నాది ఇది నాదని అదిరి పడతావు
చివరికి ఏది రాదు నీ వెంట‖ 2x ‖
దిగంబరిగానే నీవు పుడతావు
దిగంబరిగానే నీవు వెళతావు‖ 2x నేడు ‖