Chorus
నీ ఆరాధన హృదయ ఆలాపనా
ఆత్మతో సత్యముతో . .
ఆరాధించెదను ఆరాధించెదను
ఆరాధన యేసు ఆరాధన
ఆరాధన క్రీస్తు ఆరాధన
Verse
అరుణోదయమున ఆరాధన సూర్యాస్తమయమున ఆరాధన
దినమెల్ల నీ నామం కీర్తించిన నా ఆశ తీరునా‖ 2x ‖
Verse
స్తోత్రము చేయు పెదవులతొ తంబుర సితార నాధముతో
విరిగి నలిగిన హృదయముతో ఆరాధనకు యోగ్యుడవు‖ 2x ‖