Verse
నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభు
నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీ ప్రభు‖ 2x ‖
నీ ప్రేమా నా లోనా‖ 2x ‖
ప్రతిక్షణం అనుభవించనీ‖ 2x నీ చల్లనైన ‖
Verse
మట్టి వంటిది నా జీవితం
గాలి పొట్టు వంటిది నా ఆయుషు‖ 2x ‖
పదిలముగా నను పట్టుకొని‖ 2x ‖
మార్చుకుంటివా నీ పోలికలో‖ 2x ‖
మరణ భయమిక లేదంటివి‖ 2x నీ చల్లనైన ‖
Verse
మారా వంటిది నా జీవితం
ఎంతో మదురమైనది నీ వాక్యం‖ 2x ‖
హృదయములో నీ ప్రేమా‖ 2x ‖
కుమ్మరించుమా జుంటి తేనెలా‖ 2x ‖
(ఆహా) మధురం మధురం నా జీవితం‖ 2x నీ చల్లనైన ‖
Verse
అల్పమైనది నా జీవితం
ఎంతో ఘనమైది నీ పిలుపు‖ 2x ‖
నీ సేవలో నే సాగుటకు‖ 2x ‖
నను నింపుమా నీ ఆత్మ శక్తి తో‖ 2x ‖
నే ఆగక సాగెద నీ సేవలో‖ 2x నీ చల్లనైన ‖