Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Charanamulae Nammithi Nee Paadamulae

నీ చరణములే నమ్మితి నీ పాదములే

Nee Charanamulae Nammithi Nee Paadamulae

Chorus
నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితిఁ బట్టితిఁ బట్టితి
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
దిక్కిఁక నీవే చక్కఁగ రావే మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
ఐహిక సుఖము నరసితి నిత్యము ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
న్యాయము గాని నా క్రియ లన్ని రోయుచుఁ ద్రోయకు త్రోయకు
త్రోయకు‖ త్రోయకు నీ చరణములే ‖
Verse
భావము మార్చి నావెతఁ దీర్చి దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
చంచల బుద్ధి వంచన యెద్ది ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
చుట్టుకొని యున్న శోధన లున్నఁ పట్టు విడఁ గొట్టవే కొట్టవే కొట్టవే
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
నాచు పిశాచి నరుకుట గాచి కాచుకో దాఁచవే దాఁచవే దాఁచవే
నీ చరణములే‖ నీ చరణములే ‖
Verse
యేసుని తోడ నెన్వరు సాటి దోసముఁ బాపును బాపును బాపును
నీ చరణములే‖ నీ చరణములే ‖

Related Tags

PrayerSurrenderDevotion