Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chenthako Prabho Ne Jerethan Kashtambu Lechinan Nin Jeretha

నీ చెంతకో ప్రభో నే జేరెదన్ కష్టంబు లేచినన్ నిన్ జేరెద

Nee Chenthako Prabho Ne Jerethan Kashtambu Lechinan Nin Jeretha

Verse
నీ చెంతకో ప్రభో - నే జేరెదన్
కష్టంబు లేచినన్ - నిన్ జేరెద
నా పాట యెప్పుడు - నీ చెంత నుండును
నీ చెంత నుందును - నా రక్షకా
Verse
భానుండు ద్రిమ్మరి - యిట్టిప్పుడు
క్రుంకంగ నిక్కడ నా చుట్టును
చీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందును
నీ చెంతనుందును - నా రక్షకా
Verse
ఆకాశమండల - మార్గంబును
నాకీవు చూపుమా - నీ కూర్మిచే
నీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగా
నీ చెంతనుందును - నా రక్షకా
Verse
నే నిద్రలేక నీ - స్తోత్రంబుతో
శోకంపు రాళ్ళుగ - బేతేలును
నీకై నిర్మింతును - నా దుఃఖమందున
నీ చెంతనుందును - నా రక్షకా
Verse
ఆనంద పూర్ణమై - పక్షంబులన్
నాకంబు నంటుచు - నే లేచినన్
నా పాటయంతయు - నీ చెంతనుండు
నీ చెంతనుందును - నా రక్షకా

Related Tags

PrayerPsalmDevotion