Verse
నీ చేతి కార్యములు సత్యమైనవి
నీ నీతి న్యాయములు ఉన్నతమైనవి‖ 2x ‖
నీ ఆజ్ఞలు కృపతో నిండియున్నవి
నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి‖ 2x ‖
Verse
బల సౌందర్యములు
పరిశుద్ధ స్థలములో ఉన్నవి
ఘనతా ప్రభావములు
ప్రభు యేసు సన్నిధిలో ఉన్నవి‖ 2x ‖
మాపై నీ ముఖ కాంతిని
ప్రకాశింపజేయుము యేసయ్యా
Verse
నీ ఆలోచనలు గంభీరములు
నీ శాసనములు హృదయానందకరములు‖ 2x ‖
నీ మహిమ ఆకాశమంత వ్యాపించియున్నవి
నీ ప్రభావం సర్వ భూమిని కమ్ముచున్నవి‖ 2x బల సౌందర్యములు ‖
Verse
ఎవర్లాస్టింగ్ ఫాదర్
యువర్ గ్రేస్ ఎండ్యూర్స్ ఫరెవర్
ఎవర్లాస్టింగ్ ఫాదర్ – మై జీసస్
Verse
నిత్యుడైన తండ్రి
నీ కృప నిరతము నిలచును
నిత్యుడైన తండ్రి – నా యేసయ్య
Verse
నీ రూపము ఎంతో మనోహరము
నీ అనురాగము మధురాతి మధురము‖ 2x ‖
నీ నామము నిత్యము పూజింపతగినది
నీ విశ్వాస్యత నిరతము నిలచునది‖ 2x బల సౌందర్యములు ‖