Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee chethilo oka kalamuga chithrinche kunchega

నీచేతిలో ఒక కలముగా చిత్రించే కుంచెగ

Nee chethilo oka kalamuga chithrinche kunchega

Lyricist: Dr Noah R Ajay Kumar
Verse
నీచేతిలో ఒక కలముగా - చిత్రించే కుంచెగ
నీరూపుకు ప్రతిరూపుగ - మలిచావు నన్నిలా
నీ గాయపు కిరణాల ప్రోగుగ
నీవాక్యపు నెరవేర్పుల కృతినిగ
చేశావు నన్నిలా..
Verse
నీ స్వరం విన్న క్షణం
కరిగిపోయె నా హృదయం
చేరువై నీ ప్రేమకు - దాసోహమైతిని
తల వంచి నీదు పాదాల చెంత - జీవింతు నీ కోసమే
Verse
నీవు నాకుండగా
కొదవయే నాకు లేదుగా
సాక్షిగా నీ సేవలో - తుదివరకు నడిచెద
దేదీప్యమైన నీ రాజ్యమందు
వశియింతు నాయేసయ్య.

Related Tags

ThanksgivingDevotional