Verse
నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము‖ 2x ‖
Verse
అంధకార లోయలోన
సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది
నా త్రోవకు నిత్యవెలుగు‖ 2x ‖
Verse
ఘోరపాపిని నేను తండ్రి
పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను‖ 2x ‖
Verse
ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసెదన్‖ 2x నీ చేతితో ‖