Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee chethitho nannu pattuko nee aathmatho na

నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో న

Nee chethitho nannu pattuko nee aathmatho na

Verse 1
నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము
Verse
అంధకార లోయలోన సంచరించినా భయము లేదు
నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు
Verse
ఘోర పాపిని నేను తండ్రి పాప ఊబిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను
Verse
ఈ భువిలో రాజు నీవే నాదు హృదిలో కాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేయగా

Related Tags

SurrenderGuidanceHoly Spirit