Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Chitthamu Sampoorthigaa Naalo Jariginchumaa

నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా

Nee Chitthamu Sampoorthigaa Naalo Jariginchumaa

Verse
నీ చిత్తము సంపూర్తిగా నాలో జరిగించుమా
నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుమా
నీ ఉద్దేశ్యములు – ఉన్నతమైనవి
నీ ఆలోచనలు – గంభీరమైనవి
నా పూర్ణ హృదయముతో – నా పూర్ణ ఆత్మతో
నా పూర్ణ మనస్సుతో – నా పూర్ణ శక్తితో
యేసు నిన్నే ప్రేమింతును -నీ ఆజ్ఞలను గైకొందును
Verse
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినావు
నా అంతరింద్రియములను నీవే కలిగించినావు
నాయెడల నీకున్న తలంపులు
బహు విస్తారములు నా ప్రభువా
నీ ఇష్టమే నాలో నెరవేర్చుమా
Verse
నీకు వేరుగా ఉండి నేనేమి చేయలేను
నీకు లోబడకుండా నేను వర్దిల్లలెను
నీ కట్టడలను నాకు బోధించి
నీ వాక్యంతో నన్ను నిలుపుము
నీ ఇష్టమే నాలో నేరవేర్చుమా

Related Tags

SurrenderDevotionGods Will