Verse
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని
నీ కృపావరమునే దానముగా దయచేసి‖ 2x ‖
నీ ప్రేమలో పరవశించి
నీ సన్నిధిలో నే చేరి
నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను
దేవా… నా దేవా…
నా యేసయ్యా నా రక్షకుడా‖ 2x నీ చిత్తమునే ‖
Verse
హృదయము బ్రద్దలై ఏడ్చిన వేళ
కన్నీటి ప్రార్దన చేసిన వేళ‖ 2x ‖
నీ చిత్తముకై నే ఎదురు చూసి
నీ బలము పొంద సహియింప చేసి
నా ప్రాణమును తృప్తి పరచితివే‖ దేవా ‖
Verse
నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా
భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను‖ 2x ‖
నా శత్రువుపై నాకు జయమునిచ్చి
నా ఆశ్రయమై ధైర్యమును నింపి
నా కోట నీవైతివే‖ దేవా ‖